Praja Kshetram
క్రైమ్ న్యూస్

దొంగ బాబాలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు – పంచాయతీ ఆఫీస్లో బంధించి మరీ !

దొంగ బాబాలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు – పంచాయతీ ఆఫీస్లో బంధించి మరీ !

 

– ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు

– దొంగ బాబాలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

– పంచాయతీ కార్యాలయంలో బంధించి పోలీసులకు అప్పగించిన స్థానికులు

యాదాద్రి భవనగిరి ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం):కాషాయ దుస్తులు ధరించి, ఇంటింటికీ వెళ్లి మాయమాటలు చెప్పి డబ్బులు కాజేస్తున్న దొంగబాబాలను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అనంతరం ఆ బాబాలను పోలీసులకు అప్పగించారు స్థానికులు. బాధితుల వద్ద ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

– బాధితులు పైళ్ల సతీశ్ కథనం ప్రకారం

శుక్రవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు కాషాయ దుస్తులు ధరించి పనకబండ గ్రామంలో సంచరించారు. తాము ఆంజనేయస్వామి భక్తులమని చెప్పి, ప్రతి ఇంటికీ వెళ్లి కానుకలు అడుగుతూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఓ కిరాణా దుకాణం యజమాని అయిన పైళ్లా సతీశ్ ఇంటికి వెళ్లి మీకు పిల్లలు ఉన్నారా? అని అడిగి, వారి పరిస్థితిని ఆసరాగా చేసుకొని, ఆంజనేయ కన్నె స్వాములతో పూజలు చేస్తే, పిల్లలు పుడతారు అంటూ బొట్లు పెట్టి కానుకగా రూ. 2000 రూపాయలు వసూలు చేశారు. మీకు సంతానం లేక బాధపడుతున్నారని చెప్పి, చెట్ల పసరుతో సంతానం కలిగేలా చేస్తామని అందుకు రూ.18 -రూ.19 వేలు ఖర్చవుతుందని దొంగబాబాలు చెప్పారు. మీ ఇంటి దగ్గరే పూజలు నిర్వహించాల్సి ఉంటుందని వారి గురువుతో ఫోన్లో మాట్లడి చెప్పడంతో అనుమానం కలిగిన సతీశ్ ఈ సమాచారాన్ని గ్రామస్తులు ,మాజీ సర్పంచ్కు తెలపడంతో మరుసటిరోజు ఫోన్లో సదరు బాబాలతో మాట్లడి రూ.11 వేలకు బేరం కుదుర్చుకొని ఇంటికి రమ్మని పిలిచాడు. పిలిచిన 30 నిమిషాల్లో వచ్చిన దొంగ బాబాలను గ్రామస్తులు పట్టుకొని నిలదీశారు. దొంగబాబాలను దేహశుద్ధి చేసిన గ్రామస్థులు : దీంతో కంగుతిన్న సదరు బాబాలు అసలు నిజం చెప్పారు. తాము స్టేషన్ ఘనపూర్ గ్రామానికి చెందిన, కళ్లెం విజయ్ అని మిగిలిన ఇద్దరు తన తమ్ముల్లయిన, కళ్లెం జీవన్ లాల్, కళ్లెం కృష్ణలతో కలసి, స్వాముల వేషాల తో తిరుగుతూ కానుకలు తీసుకుంటున్నామని సతీశ్ దగ్గర నుంచి 700 రూపాయలు ఫోన్‌పే ద్వారా, 1500 స్వయంగా, వసూలు చేశామని, ఇదే విధంగా ఇతర గ్రామాల్లో పలుచోట్ల కానుకల పేరుతో 500, 1000 రూపాయలు చొప్పున వసూళ్లు చేస్తున్నట్లు స్వాములు ఒప్పుకున్నారు. ఇంకా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం కలిగిన గ్రామస్తులు సదరు బాబాలకు దేహశుద్దిచేసి గ్రామపంచాయతీ భవనంలో బందించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ముగ్గురు దొంగ స్వాములను తమ అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. బాధితులు వద్ద ఫిర్యాదుతీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts