Praja Kshetram
తెలంగాణ

అనుమతులు లేని దాబాపై పంచాయతీ అధికారం నిర్లక్ష్యం ఎందుకు?

అనుమతులు లేని దాబాపై పంచాయతీ అధికారం నిర్లక్ష్యం ఎందుకు?

 

– నోటీసుల పేరుతో నిమ్మకు నీరేతున్న మండల పంచాయతీ అధికారి.

– ఇరిగేషన్ కాలువపై చెత్తాచెదారం.

– పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు.

– క్షేత్రస్థాయిలో విచారించి చర్యలు సంబంధిత అధికారులు తీసుకోవాలి.

కొండాపూర్ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని నేషనల్ హైవే పక్కన గల గిర్మాపూర్ రెవెన్యూ శివారు లో 108 సర్వే నంబర్ లో కింగ్స్ త్రీ ధాబా పూర్తి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. రెవిన్యూ ఇరిగేషన్ పంచాయతీ అధికారులకు తెలిసినా తెలవనట్టు వివరించడం వెనుక అంతర్యమేమిటో వారికే తెలియాలి.. ధాబా ఏర్పాటు 14 గుంటలలో గతంలో షెడ్డు ఏర్పాటు చేశారు. ఆరు నెలల క్రితం మరో షెడ్యూనిర్మానం అదనంగా నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు నా లా కన్వర్షన్ డిటిసిపి అనుమతి. పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే ఆరు నెలల నుండి దాబా నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవే పక్కన పూర్తి అనుమతులు లేకుండా యదేచ్చగా దాబా నిర్వహిస్తుంటే నిత్యం మండలానికి వెళ్లే అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం వెనుక అక్రమ నిర్మాణాలకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. లేకుండా దాబా పక్కనే ఇరిగేషన్ పంట కాలువ పంటపొలాలకు వెళ్లేందుకుంది. కాలువ పక్కనే జనరేటర్. షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం రెండు మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు .

– పంచాయతీ కార్యదర్శిని వివరణ

అనుమతులు పాత షెడ్డు వరకే ఉన్నాయని కొత్తగా నిర్మించిన షెడ్డు కు ఎలాంటి అనుమతులు లేవని విచారణ చేసి జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక పంపించామన్నారు. దాబానిర్వాకులకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. సంబంధిత అధికారులు పూర్తి విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts