Praja Kshetram
తెలంగాణ

మల్లన్న,బీరప్ప స్వామి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.

మల్లన్న,బీరప్ప స్వామి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.

 

కొండాపూర్ మే 01(ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని శివన్నగూడ గ్రామంలో మల్లన్న, బీరప్ప దేవుళ్ళ జాతర మహోత్సవం సందర్భంగా గురువారం మల్లన్న స్వామికి బీరప్ప కు గ్రామ భక్తులు బోనాలు తీశారు. ఈ బోనాల జాతరకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై స్వామి వాళ్ళను దర్శించుకుని బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్లన్న బీరప్ప దేవుళ్ళ దీవెనలు గ్రామ ప్రజలపై ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, పార్టీ మండల జనరల్ సెక్రెటరీ నర్సింలు, మారేపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశం గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, గంగారం గ్రామ అధ్యక్షులు గోపాల్ గ్రామ ప్రజలు ఉన్నారు.

Related posts