జననేత ఎమ్మెల్యే యాదయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోత్కుపల్లి మైపాల్
– గజమాలతో సత్కరించిన మైపాల్
చేవెళ్ల, మే 16(ప్రజాక్షేత్రం): చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య జన్మదిన వేడుకలను శుక్రవారం చేవెళ్ల లో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల, శంకర్ పల్లి, మొయినాబాద్, షాబాద్, నవాబ్ పేట మండలాలతో పాటు మున్సిపల్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేవెళ్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైపాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యాదయ్య ను గజామాల, శాలువాలతో కేక్ కట్ చేసి ఘనంగా సత్కరించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.