కన్న కూతురిపై తండ్రి అత్యాచారం- ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపు!
– పదేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం
– పోక్సో చట్టం కింద కేసు నమోదు
రాజస్థాన్ మే 16(ప్రజాక్షేత్రం):కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి, తన పదేళ్ల కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, అజ్మీర్లో బాధితురాలి తల్లింద్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కౌన్సిలింగ్ సమయంలో తండ్రి తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని బాధితురాలు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అది కూడా తన తల్లి పనికి వెళ్లినప్పుడు అలా చేసేవాడని తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలని బెదిరించినట్లు చెప్పింది. ఈ ఘటనపై రాజస్థాన్ మహిళ కల్యాణ్ మండల్ కో ఆర్డినేటర్ బాధితురాలి తరపున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ మహిళా కల్యాణ్ మండల అధికారిణి మాట్లాడుతూ బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.