Praja Kshetram
తెలంగాణ

డ్రైనేజీ అస్తవ్యస్తం రోడ్లపై పారుతున్న మురుగు నీరు.

డ్రైనేజీ అస్తవ్యస్తం రోడ్లపై పారుతున్న మురుగు నీరు.

 

– సమస్య పరిష్కరించడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.

– ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మున్సిపల్ అధికారులు.

మేడ్చల్ జిల్లా జూన్ 16(ప్రజాక్షేత్రం):దుండిగల్ మున్సిపల్ పరిధి గండి మైసమ్మ, గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2,3 లో డ్రైనేజీ మురికి నీరు అంతా రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.

– డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం ప్రధాన కారణం: స్థానికులు

గత సంవత్సర కాలం నుండి ఈ మురుగు నీటితో సాహసం చేస్తున్న కానీ ఏ ఒక్క అధికారి చర్యలు తీసుకులేదు. ఈ సమస్య సమస్యగానే ఉండిపోయింది. కానీ సమస్యను తీర్చే నాధుడే లేకుండా పోయాడు. ఇక్కడ జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణమని స్థానికులు మీడియా కు చెప్పుకొచ్చారు.

– రోడ్డుపై ఏరులై పారుతున్న మురుగు నీరు.

గండి మైసమ్మ గణేష్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై పారుతుంది. మురికినీరు రోడ్లపై పారుతుంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురికి నీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో చుట్టూ పక్కన నివసిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికినీరు రోడ్డుపైనే నిలుస్తుండడంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అసలే వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు, దోమల బెడద తో మరింత కష్టాలు ఎదుర్కొంటున్నారు.

– రోడ్లపై ముక్కు మూసుకుని నడవాల్సిన దుస్థితి

రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి. దీంతో పాటు రోడ్లపై రాకపోకలు సాగించలేక వాహనదారులు, పాదాచారులు అనేక అవస్థలు పడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Related posts