Praja Kshetram
తెలంగాణ

సినీ నటుడు విజయ్‌ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

సినీ నటుడు విజయ్‌ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

 

రాయదుర్గం జూన్ 22(ప్రజాక్షేత్రం):సినీ నటుడు విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పలు గిరిజన సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయని వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపించాయి. దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం పలు గిరిజన సంఘాల నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు సినీ నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Related posts