Praja Kshetram
క్రైమ్ న్యూస్

ఏసీబీ వలలో సుల్తానాబాద్ మున్సిపల్ అధికారులు

ఏసీబీ వలలో సుల్తానాబాద్ మున్సిపల్ అధికారులు

 

– సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

– 5000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు మున్సిపల్ అధికారులు

సుల్తానాబాద్, జూన్ 28(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ దాడులు మరింత స్పీడ్ తో కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయంపై కొనసాగిన దాడులు మరవకముందే, సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఈ దాడుల్లో సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరూ అధికారులు ఏసీబీకి చిక్కారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఆర్నకొండ ప్రసాద్ తన ఇంటి నెంబర్ కోసం సుల్తానాబాద్ మున్సిపల్ లో దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం మున్సిపల్ ఉద్యోగులైన ఆర్ఐ వినోద్, బిల్ కలెక్టర్ విజయ్ లు 5000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. కాగా శనివారం దరఖాస్తుదారుడు ప్రసాద్ నుండి వినోద్, విజయ్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్ స్పెక్టర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts