నేడు తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి.
– ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:30 వరకు
– తాసిల్దార్ బి.అశోక్
కొండాపూర్ జూలై 13(ప్రజాక్షేత్రం):ప్రతి సోమవారం ప్రజల సమస్యలు పరిష్కారం కొరకు కొండాపూర్ తాహసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని మండల అన్ని శాఖల అధికారులు ఎంపీడీవో,ఎంపీఓ, ఏపీవో, ఇరిగేషన్ ఎఈ, విద్యుత్ ఏఈ, ఎంఈఓ, ఏపిఎం, ఎంఏఓ, ఏఈ పిఆర్, అగ్రికల్చర్ ఏవో, హార్టికల్చర్ ఇతర మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో హాజరు కావాలని స్థానిక తహసిల్దార్ అశోక్ అధికారులకు ఆదివారం సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:30 సమయం వరకు నిర్వాహన జరుగుతుందని, ప్రజల సమస్యలు దరఖాస్తు రూపంలో అందజేసి.. రసీదు తీసుకోవాలని అన్నారు. ఇచ్చిన దరఖాస్తును పరిశీలన చేసి సంబంధిత అధికారులతో సమన్వయమై సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు.