Praja Kshetram
తెలంగాణ

ప్రభుత్వ స్కూలు కబ్జా.. ఆవరణలో బిల్డింగ్ కట్టుకున్న గ్రామస్థుడు

ప్రభుత్వ స్కూలు కబ్జా.. ఆవరణలో బిల్డింగ్ కట్టుకున్న గ్రామస్థుడు

 

– పెద్దపల్లి జిల్లా ముత్తారంలో స్థానికుడి నిర్వాకం

– విద్యార్థులు లేక మూతపడ్డ ప్రభుత్వ పాఠశాల

– పక్కనే చిన్న గుడిసె కట్టుకుని క్రమంగా బిల్డింగ్ ఆక్రమించిన ఘనుడు

పెద్దపల్లి జులై 19(ప్రజాక్షేత్రం):ఖాళీగా ఉంటే చాలు ప్రభుత్వానిదైతేనేం, ప్రైవేటు ఆస్తి అయితేనేం అనే రీతిలో కబ్జాదారులు వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా ప్రభుత్వ స్కూలునే ఆక్రమించేశారు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో ఓ వ్యక్తి ఏకంగా పాఠశాల భవనాన్నే కబ్జా చేశాడు. కొన్నేళ్లుగా సొంతిళ్లులా వాడుకుంటున్నాడు. అయినా అధికారులు ఉదాసీనత వదలడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం మండల కేంద్రంలోని కాసర్లలగడ్డలో ప్రభుత్వ పాఠశాల ఆక్రమణకు గురైంది. విద్యార్థులు లేకపోవడంతో భవనం మూతపడింది. ప్రైవేట్ టీచర్ ఒకరు అదే బిల్డింగ్ లో పాఠశాలను నడిపించాడు. ఐదో తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. కొంతకాలం తర్వాత ఆయన కూడా మానేయడంతో స్కూలు బిల్డింగ్ మళ్లీ మూతపడింది. ఇదే అదనుగా ఓ వ్యక్తి పాఠశాల బిల్డింగ్ ను ఆక్రమించేందుకు ప్లాన్ చేశాడు. ముందుగా స్కూలు బిల్డింగ్ పక్కనే చిన్న గుడిసె నిర్మించాడు. క్రమంగా బిల్డింగ్ లో తిష్టవేశాడు. అడిగే వారు లేకపోవడంతో ఏళ్ల తరబడి తన స్వంత ఆస్తి లాగా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ స్థలంలో నూతనంగా ఇల్లు నిర్మాణం చేపట్టి పూర్తిగా ఆ గవర్నమెంట్ బిల్లింగ్ ను తన ఆధీనంలో ఉంచుకున్నడు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ బిల్డింగ్ ను స్వాధీనం చేసుకోవాలని, స్కూలును తిరిగి ప్రారంభించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts