ఘనంగా కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలు..
– కేటీఆర్ యువతకు మార్గదర్శకుడు
– తెలంగాణ భవిష్యత్తుకు ఆశాకిరణం కేటీఆర్
– మాజీ ఎంపీపీ ధర్మనగారి గోవర్ధన్ రెడ్డి
శంకర్ పల్లి, జులై 24(ప్రజాక్షేత్రం):కేటీఆర్ యువతకు మార్గదర్శి, తెలంగాణకు భవిష్యత్ ఆశాకిరణం.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పిన దార్శనికుడు కల్వకుంట్ల తారకరామారావు అని శంకర్ పల్లి మాజీ ఎంపీపీ ధర్మనగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం కేటీఆర్ 49వ జన్మదినోత్సవం వేడుకలు శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ వార్డులో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జై కేటీఆర్ జై కేసీఆర్ జై జై టిఆర్ఎస్ పార్టీ నినాదాలతో మ్రోగింది కేటీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని గులాబీ మయంగా మారింది. పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ధర్మనగారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… కేటీఆర్ జన్మదినోత్సవం వందలాది మంది ప్రజల, పిల్లల మధ్యన జరుపుకోవడం ఆనందంగా ఉందని రాబోవు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ భవిష్యత్తు ఆశా కిరణం కేటీఆర్ అని అన్నారు. అనంతరం కేక్ ఫుడ్ ప్యాకెట్స్ పిల్లలకు పంపిణీ చేశారు.