ఆలూరు అక్రమాలపై అధికారుల చర్యలేవి?
– ఎన్ని అక్రమాలు జరుగుతున్న అధికారులు మౌనం..?
– అవినీతి పై జిల్లాఉన్నత అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
– అనుమతులు లేకుండా పామ్ హౌస్ నిర్మాణం.
– నోటీసులు ఇచ్చి 2.5 లక్షలు నొక్కేసిన ఓ సిబ్బంది.
– బయటపడిన గ్రామపంచాయతీ అవినీతి బాగోతం.
– గ్రామానికి చెందిన ఓ పెద్దమనిషి సూత్రదారి.
– అతనితో కలిసి పంచాయతీ సిబ్బంది నకిలీ డ్రామా
చేవెళ్ల, జూలై 27(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలపరిధిలోని ఆలూరు గ్రామ పంచాయతీలో అనుమతుల పేరిట నోటీసులు ఇచ్చి 2.5 లక్షలు నొక్కెసిన పంచాయతీ కార్యాలయ సిబ్బంది. కాసుల కోసమే నకిలీ నోటీసులు ఇచ్చారన్నది తేటతెల్లమయ్యింది. అసలు నాలా కన్వర్షన్ లేకుండా బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారన్నది ప్రశ్నార్థకం. అనుమతులు లేని నిర్మాణాలన్ని అధికారులకు తెలిసే జరుగుతున్నాయన్నది అనడానికి ఇదొక ఉదాహరణ. అధికారులకు లెక్క కుదిరాక పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ముడుపులు అందితే నేతి పరమాన్నం పెడుతున్నారనే తీవ్ర విమర్శలు వెళ్లువెతతున్నాయి. నోటీసుల తర్వాత ఎటువంటి చర్యలు ఉండడం లేదు. కొందరు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధుల అండదండలతోనే అక్రమ నిర్మాణాల తంతు వ్యవహారం కొనసాగుతున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. అనుమతుల పేరుతో కొందరు పదవులు లేకపోయినా వారిదే రాజ్యం అన్నట్టుగా చలామణి చేస్తూ నిర్మాణదారుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున చేపడుతున్న నిర్మాణాలు అధికారులకు వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
– అధికారుల కనుసన్నలోనే నిర్మాణాలు
అధికారుల కనుసన్నలోనే నిర్మాణాలు జరుగుతున్నా యన్న ఆరోపణలతో పాటు నిర్మాణదారుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలూరు ii సర్వే నెంబర్ 156 లో ఎటువంటి హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా 11 ఎకరాలలో ఏడాది క్రితం ఫామ్ ల్యాండ్ పేరుతో ప్లాట్లు చేసి విక్రయించారు.
– నోటీసులు కాసుల కోసమే..!
ఈ వెంచర్ లో నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్లాట్ కొన్నాడు. నాలుగు నెలల క్రితం ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టాడు. అక్రమ నిర్మాణం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న అప్పటి గ్రామపంచాయతీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి 2.5 లక్షలు నొక్కేశారు. అప్పుడు ఇచ్చిన నోటీసులు ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయంలో లేకపోవడం కాసుల కోసమే నకిలీ నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. ఫామ్ హౌస్ నిర్మాణదారులడితో అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టవద్దంటు, బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు ఇస్తామంటూ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఓ సిబ్బంది, ఆలూరు గ్రామానికి చెందిన రాజకీయనాయకుడు గ్రామ ఓ పెద్దమనిషి కలిసి, నిర్మాదారుడి నుండి ఏకంగా 2.5 లక్షలు తీసుకుని, అనుమతుల పేరిట నిర్మాణదారుడికి గ్రామపంచాయతీ స్టాంపు వేసి నకిలీ పత్రాలు ఇచ్చారు. నాల కన్వర్షన్ లేకుండా ఏ నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదు. కాని అసలు ఈ ఫామ్ హౌస్ నిర్మాణం నాల కన్వర్షన్ లేకుండానే తనకు అన్ని అనుమతులు గ్రామపంచాయతీ ఇచ్చిందని నిర్మాణదారుడు చెప్తుండటం విడ్డూరం. కాని ఇప్పటివరకు ఆ నిర్మాణానికి సంబంచిన పత్రాలు గ్రామపంచాయతీ కార్యాలయంలో లేకపోవడంతో, నాలుగు నెలలైన ఆ నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇతర పత్రాలు సదరు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న వ్యక్తి వద్దనే ఉండటం గమనర్థం. వీరు గ్రామ పంచాయతీ అధికారులతో కలిసి ఇష్టరాజ్యాంగ ఇలా ఆలూరు గ్రామపంచాయతీ పరిధిలోని చాలావరకు అక్రమ నిర్మాణదారుల నుండి వీరు ఇలాగే గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అసలు గ్రామం పంచాయతీ కార్యాలయంలో ఎం జరుగుతుంది? అవినీతి పై ఎం పీ డి వో జిల్లా ఉన్నత అధికారులు విచారణ చేపట్టాలని, అవినీతికి పాల్పడినా వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.