Praja Kshetram
పాలిటిక్స్

నువ్వెంతా నీ బతుకెంతా?

నువ్వెంతా నీ బతుకెంతా?

 

– బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగ్గారెడ్డి కౌంటర్

 

సంగారెడ్డి ఆగస్టు 08(ప్రజాక్షేత్రం):కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్ లో ఏడ్చారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారు.. నీవ్వుంతే నీ బతుకెంతా? అని మండిపడ్డారు. వ్యక్తిత్వంలో ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను ప్రభాకర్ రెడ్డి మాదిరిగా ప్యాకేజీ లీడర్ ను కాదని ప్రభాకర్ రెడ్డి మాదిరిగా కేసీఆర్ కు ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదన్నారు. నా క్యారెక్టర్ ఏమిటో ప్రభాకర్ రెడ్డికి కూడా తెలుసని అయినా ఎందుకు తొందరపడి మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డి దగ్గరున్నంత ఆస్తి నా దగ్గరుంటే రైతులకు పంచుతానన్నారు. నా గురించి కేసీఆర్, హరీశ్ రావుకు తెలుసన్నారు. మా మంత్రులు వాటాలు పంచుకోవడం కాదు కనీసం జనాలకు ఏమైనా చేద్దామంటే ప్రభుత్వ ఖజానాలో బీఆర్ఎస్ ఏమి మిగిల్చిందని దుయ్యబట్టారు. దొంగలు మీరైతే నిందలు మా మీద వేస్తారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీ తీరుగా ప్రైవేట్ కంపెనీ కాదన్నారు.

– ఆలీబాబా 40 దొంగలకు కేసీఆర్ కుటుంబానికి తేడా లేదు

కేసీఆర్ కుటుంబం అవినీతికి ప్రొఫెసర్లు అని ఈ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుని నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఆలీ బాబా 40 దొంగలకు కేసీఆర్ కుటుంబానికి తేడా లేదని ధ్వజమెత్తారు. ఈ దొంగల్లో ప్రభాకర్ రెడ్డి కూడా ఓ దొంగ అని విమర్శించారు. కేసీఆర్ కూతరు కవిత ఢిల్లీలో లిక్కర్ దుకాణం తెరిచింది. కవిత కేజ్రీవాల్ కథ ముగించేసిందని ఆరోపించారు. పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ దాకా రాత్రి 2 గంటల వరకు లిక్కర్, పబ్బు దందాలేనని కేటీఆర్ బావమరిది సంతోష్ ఈ దందా సాగిస్తున్నాడని పోలీసులు చెప్పారన్నారు. భూకబ్జాల్లో కేసీఆర్ కుటుంబం ఎక్స్ పర్ట్ అన్నారు. కాళేశ్వరంలో రూ. లక్ష కోట్లలో 30 శాతం వేసుకున్నా రూ. 30 వేల కోట్లు తినేసి ఉంటారన్నారు. గత ప్రభుత్వ హయాలంలో కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులను లెక్కేసుకోవడానికే కేసీఆర్ తన దగ్గరకు ఎవరిని రానివ్వలేదని ఆరోపించారు.

Related posts