రెడ్ అలర్ట్ జోన్ లోకి వనపర్తి జిల్లా.
– ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
– అవసరమైతే తనకు నేరుగా ఫోన్ చేయండి.
– ఎమ్మెల్యే మేఘారెడ్డి.
వనపర్తి ప్రతినిధి ఆగస్టు 13(ప్రజాక్షేత్రం):రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా వనపర్తి జిల్లా ఎల్లో జోన్ నుంచి రెడ్ జోన్ లోకి చేరినట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయాణాలు చేయాలని లేదంటే రెండు రోజులపాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.మట్టి మిద్దెల్లోనూ శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లల్లోనూ నివాసం ఉండేవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.వాగులు వంకలు ఉన్నచోట ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.వర్షాల కారణంగా ఇబ్బంది పడే వారికి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు చేయూతనందించి సహకరించాలని ఆయన కోరారు. వర్షం కారణంగా ఎవరైనా అత్యవసర ఇబ్బందులకు గురైతే తనకు నేరుగా ఫోన్ చేయాలని 9494216666 కోరారు. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎటువంటి సమస్య ఉన్న 08545-220351-233525 కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
