Praja Kshetram
తెలంగాణ

ఉద్యమ నాయకులపైననా మీ కుట్రలు కుతంత్రాలు

ఉద్యమ నాయకులపైననా మీ కుట్రలు కుతంత్రాలు

 

 

– రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి.

రంగారెడ్డి, ఆగస్టు 13(ప్రజాక్షేత్రం):ఉద్యమ నాయకులపైననా మీ కుట్రలు కుతంత్రాలు అంటూ మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి..బుధవారం విలేఖరులకు అందజేసిన ఒక ప్రకటనలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ…మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. అరవైయేండ్ల నిరీక్షణ.‘మా తెలంగాణ మాగ్గావాలె’ అని..ఊరూవాడ ఒక్కటి చేసి సబ్బండ వర్నాలను ఏకంచేసి తెలంగాణ సాదనలో కీలక పాత్ర వహించిన కోదండరామ్ పైననా మీ కుట్రలు నిఖార్సయిన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని మంటగలపడానికి,వారి అస్తిత్వాన్ని అవహేళన చేయడానికి బిఅర్ఎస్ పన్నని కుట్రలు లేవు. ఆడని డ్రామా లేదు.నాడు సమక్యవాదుల కుతంత్రాలను తిప్పికొట్టడానికి..ఉద్యమ తీవ్రతను..స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పడానికి దండోరా వేసి..దండును కూడగట్టి.. ‘జై తెలంగాణ’ అంటూ పురుడు పోసుకున్నది ఆచార్య కోదండరామ్ గారు ఛైర్మన్ గా తెలంగాణ జెయింట్ యాక్షన్ కమటి. వారి ఆద్వర్యంలో సకల జనుల సమ్మె,సాగరహారం లాంటి అందోలనలతోనే కదా తెలంగాణ రాష్ట్రం సహకారం అయ్యిందన్నారు.అలాంటి నికాసైన తెలంగాణ ఉద్యమ నాయకుడి పైనానా మీ అక్కసు.తెలంగాణ.ఆత్మగౌరవ ప్రతీకగా పరిపాలనా కొనసాగాలి అన్నందుకా,తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా చాటేలా పరిపాలన ఉండాలన్నందుకా ప్రొఫెసర్ కోదండరామ్ గారిపైనా పగా.. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎక్కడ ముఖ్య భూమిక పోషిస్తాడో అన్న దుష్ట సంకల్పంతో ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పరిపాలనలో భాగస్వామ్యం కాకుండా చేసింది బిఅర్ఎస్, నాటి తెలంగాణ వ్యతిరేకులుగా సమైక్య వాదుల తొత్తులుగా ఉన్న,ఉద్యమ ద్రోహులను తీసుకు వచ్చి తెలంగాణ ఉద్యమ నాయకులను నిందలు మోపుతూ , కించపరుస్థున్న బిఆర్ఎస్ నాయకులను వారి కుట్రలను ప్రజలు హర్షించరని పాండురంగా రెడ్డి అన్నారు.

Related posts