- అంబురామేశ్వర దర్శనం… సర్వపాపహరణం!
– సీతమ్మ దాహం తీర్చడానికి రామయ్య వేసిన బాణంతో భూమి నుండి వెలువడిన నీటి ధార
– త్రేతాయుగంలో శ్రీరాముడి చేత ప్రతిష్టించిన శివలింగం
– కర్ణాటక రాష్ట్ర గుల్బర్గా గ్రథలయంలో భద్రంగా ఉన్న అంబురామేశ్వర స్వామి దేవాలయం చరిత్ర
– నిత్యం భక్తులకు అన్నదానం
– జాతరకు ముస్తాబవుతున్న దేవాలయ
పెద్దేముల్ ఆగస్టు 13(ప్రజాక్షేత్రం):దట్టమైన అడవిలో భక్తులు కోరిన కోరికలు తీర్చి అబ్బురపరిచే ప్రతీకగా. ఎన్నో చరిత్రలకు నెలవుగా శ్రీ అంబురామేశ్వరా దేవాలయంగా ఈ ప్రాంత భక్తులు భావిస్తారు. త్రేతయుగంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లినప్పుడు ఇక్కడ సేదతీరుతున్న సమయంలో సీతమ్మ కు దాహం తీర్చడానికి రామబానంతో భూమిలోకి కొట్టగా భూమి నుండి పైకి వెలువడిన నీటితో సీతమ్మ కు దాహం తీర్చే క్రమంలో శ్రీరాముడు శివుడిని తలుచుకొని శ్రీ అంబురామేశ్వర స్వామీ గా అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్టించి శ్రీ రాముడి చేత అభిషేకం, పూజలు అందుకోవడం ఇక్కడి శివలింగం విశేషంమని పురాణాలు వెల్లడిస్తున్నాయనీ, చరిత్రలో ఉందని ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు సూచించారు….
అంభురామేశ్వర దేవాలయం… వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం, పెద్దేముల్ మండలంలోని మారు మూల ప్రాంతమైన తెలంగాణ – కర్ణాటక సరిహద్దులోని తట్టే పల్లి అటవీ ప్రాంతంలో పరమేశ్వరుడు శ్రీ అంబురామేశ్వరుడిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో ప్రసిద్ధిపొందినదీ,
– ఇక్కడ కొలువైన స్వామి స్వరూపం వెనుకా ఆసక్తికరమైన కథనం ఉంది.
త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు సీతదేవి దాహం వేస్తుందని చెప్పడంతో భూమి వైపు రామబాణం వేయడంతో భూమి నుండి వెలువడిన నీటిని తీసుకొని శివుడిని తలుచుకొని శివలింగాన్ని ప్రతిష్టించి భూమిపై రామబాణం వేయడంతో వెలువడిన నీటిని తీసుకొని శివలింగాన్ని అభిషేకం చేసి, అంబురామేశ్వర స్వామిగా సాక్షాత్తు శ్రీరాముడే పూజలు నిర్వహించారనీ చరిత్ర సూచిస్తుందని, ఆలయ చరిత్ర పత్రాలు కర్ణాటకలోని గుల్బర్గా లోని గ్రంథాలయంలో భద్రంగా ఉందని ఆలయ అర్చకులు వెల్లడించారు, అందుకే దట్టమైన అటవీ అంబురామేశ్వర ఆధ్యాత్మిక ధామంగానూ, పర్యటక ప్రాంతంగానూ అటవీ అందాలతో అటు భక్తుల్నీ, ఇటు పర్యటకుల్నీ ఆకట్టుకుంటోంది. ఈ ఆలయంలోకి ప్రవేశించి… ఇక్కడి గుట్టలు, రకరకాలైన మూలికలున్న చెట్లు, నంది నోటి నుండి సంవత్సరం పాటు పారే జలపాతం వీక్షిస్తూ స్వామిని దర్శించుకోవడా భక్తులకు ఎంతో అబ్బురపరుస్తుంది, ఆలయ ప్రాంగణంలో ఏడాది మొత్తం జరిపే పూజలు ఒకెత్తయితే ప్రత్యేకంగా శ్రావణమాసంలో నిర్వహించే జాతర ఉత్సవం మరొకెత్తు. ముఖ్యంగా శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ముడు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహింస్తారు, స్వామివారిని తట్టపల్లి గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించడం, అభిషేకాలూ, స్వామీవారి అలంకరణలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ఆదివారం, సోమవారం, మంగళవారం ముడు రోజులు ఆలయ కమిటీ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయం వద్ద, అలాగే తట్టేపల్లి గ్రామంలో జరిగే జాతర మహోత్సవాంన్ని చూసి తరించాల్సిందే.
– దేవాలయంలోనీ ప్రత్యేకతలు…
ఆంబురామేశ్వర దేవాలయానికి వచ్చే భక్తులు కేవలం స్వామి వారి దర్శనంతోనే వెనుతిరిగి వచ్చేయరు. శ్రీరాముడిచే భూమిపైకి ఎగిసిపడిన నీటి ధార, ఇక్కడున్న నీటి గుండం, నంది నోటి నుంచి బయటకు వచ్చే నిటిదర, ఆలయ ప్రవేశంలో ఆకట్టుకునే బోలా శంకరుడి భారీ విగ్రహం, దట్టమైన అటవీ ప్రాంతం, ఆహ్లాదకరమైన వావరణాన్ని సందర్శిస్తారు. అలాగే ఆరోగ్యానికి మేలు చెసే ఐదు ఆకుల పుందికూర, ఇక్కడ మాత్రమే లభించడంతో భక్తులు పోటీ పడి మరి కీసుకెళ్లి వండుకొని తింటారనీ, ఆలయ కమిటీ సభ్యులు సూచించారు.
– జాతర మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నాం – ఆలయ కమిటీ చైర్మన్ ఉడువల వెంకటేశం
శ్రీ అబు రామేశ్వర స్వామి జాతర మహోత్సవానికి తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాండూర్, పెద్దేముల్, జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం పరిసర ప్రాంత భక్తులు, కర్ణాటకలోని చించోళ్లి, కుంచారం, బీదర్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో దైవదర్శనానికి వస్తారని, ఈ జాతర మహోత్సవానికి తాండూర్ ఎమ్మెల్యే తో పాటు వికారాబాద్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారనీ, వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి, ఎస్సై నగేష్ పెద్దేముల్ ఎస్సై వేణు కుమార్ లు పెద్దేముల్ మండల పోలీసులతో జాతర మహోత్సవానికి భారీ బందోబస్తు నిర్వహిస్తారని, భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యం ఏర్పాటు పడకుండా ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తుందని ఆలయ కమిటీ చైర్మన్ ఉడువల వెంకటేశం అన్నారు.
