మొయినాబాద్ బాకారం ఎస్ కే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకాలం
– ఎస్ కే ఫామ్ హౌస్ పై మొయినాబాద్ పోలీసుల దాడులు.
– ఫామ్ హౌస్ మొత్తం 50కి పైగా స్త్రీలు, పురుషులు ఆఫ్రికన్లు.
– ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు.
మొయినాబాద్ ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా బాకారం ఫామ్‌హౌజ్‌లో ఆఫ్రికన్ దేశస్తుల బర్త్‌డే పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా మద్యం పార్టీ చేసుకోవడంతో బాటిళ్లన్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే.. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న 51 మంది ఆఫ్రికన్ దేశస్తుల్లో.. 11 మంది వీసా గడువు ముగిసినా ఇండియాలోనే కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. బర్త్ డే పార్టీలో పలువురు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారించారు. అనంతరం వీరికి డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించారు. మిగిలిన వారి వీసాలు కూడా పరిశీలిస్తున్నారు.
