Praja Kshetram
తెలంగాణ

తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. 

తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.

 

– శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి.

– వనపర్తి జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

– అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు.

– ఉత్తమ సేవలకు మెమొంటోలు అందజేత.

వనపర్తి ప్రతినిధి ప్రజాక్షేత్రం: తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లు కిమ్యా నాయక్, యాదయ్య లతో కలిసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాలపై ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థుల ద్వారా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను తిలకించారు. ప్రభుత్వ విధినిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ చైర్మన్ ప్రమోదిని వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts