Praja Kshetram
తెలంగాణ

చినుకు పడితే చిత్తడే

చినుకు పడితే చిత్తడే

 

– శంకర్ పల్లి నుండి ఫత్తేపూర్ బ్రిడ్జి వద్ద రోడ్డు దుస్థితి

– స్కిడ్ అవుతున్న బైక్ లు.. నిత్యం ప్రమాదాలు

– శంకర్ పల్లి నుండి ఫత్తేపూర్ బ్రిడ్జి వరకు రోడ్డు వేయాలని ప్రయాణికుల డిమాండ్

శంకర్ పల్లి ఆగస్టు 20(ప్రజాక్షేత్రం):మండలంలోని శంకర్ పల్లి-ఫత్తేపూర్ వరకు రోడ్డు చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. చిన్నపాటి వర్షాలకే రోడ్డు బురదమయంగా మారుతుంది. దీంతో రోడ్డుపై ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు గుంతలు ఏర్పడి, వర్షం నీరు నిలిచి రోడ్డు మొత్తం బురదగా మారడంతో అటుగా వెళ్తున్న వాహనాలు జారీ పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ఫత్తేపూర్ బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, ఆ మార్గంలో ప్రయాణించే వారు కోరుతున్నారు. శంకర్ పల్లి నుంచి వికారాబాద్ వెళ్ళె రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయన్నారు. మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts