హత్యకేసు కేసును ఛేదించిన పానుగల్ పోలీసులు.
– తన భార్య విడిచి పెట్టడానికి కిష్టయ్య కారణమని హత్య.
– నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
– డి ఎస్ పి వెంకటేశ్వర రావు.
వనపర్తి, ఆగస్టు 23 (ప్రజా క్షేత్రం)::ఇటీవల పానగల్ మండల కేంద్రము లో జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు.కేసు వివరాలను శనివారం మీడియా సమావేశంలో వెల్లడించిన వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఎనుముల శివయ్య తండ్రి ఎనుముల కిష్టయ్య తన తండ్రి ఇంట్లో మరణించాడని పానగల్ పోలీస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పానుగల్ ఎస్సై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని, మరణించిన వ్యక్తి ఎనుముల కిష్టయ్య @ కుంటి కిష్టయ్య తండ్రి గున్నయ్య, వృత్తి: గొర్రెల గొర్రెల వ్యాపారం, వ్యాపార గ్రామం పానగల్ గ్రామం & మండలం. అదే గ్రామానికి చెందిన వసంతపురం రాములు తన వ్యక్తిగత కక్ష్య కారణంగా ఎనుముల కిష్టయ్య @ కుంటి కిష్టయ్య ను పథకం ప్రకారం హత్య చేశారని వెల్లడించారు.
– నేరం చేసిన విధానం
రాములు తన భార్య విడిచి వెళ్లడానికి కిష్టయ్య కారణమని అనుమానంతో, డబ్బులు దొంగలించి బైక్ కొనాలనె ఉద్దేశంతో కిష్టయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడని, అతని పథకం ప్రకారం 20-08-2025 న రాత్రి కిష్టయ్య ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో రాములు అతని తలపై పప్పుగుత్తితో బలంగా కొట్టి, అనంతరం గొంతు పట్టుకొని ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశాడని అనంతరం అతని జేబులో ఉన్న రూ.40,000 నగదును దోచుకొని, నేరంలో వాడిన పప్పుగుత్తిని కాడను ఎవరు గుర్తించకుండా మురికి కాలువలో పారవేశాడని, నిందితుడు హత్య అనంతరం వనపర్తి పట్టణంలో తిరుగుతూ రూ.6,000 ఖర్చు చేసి, మిగిలిన రూ.33,000 ను తన ఇంటిలో దాచి పెట్టాడనని. శనివారం ఉదయం గ్రామంలో తిరుగుతూ ఉన్న సమయంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని పోలీసు విచారణలో, నిందితుడు తన నేరాన్ని పంచుల సమక్షంలో ఒప్పుకొని, మిగిలిన నగదు, రక్తపు మరకలు ఉన్న బట్టలు నేరానికి ఉపయోగించిన పప్పుగుత్తి కాడను చూపించడానికి అంగీకరించాడనీ వెల్లడించారు. ఈ నేరస్థులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, పానగల్ ఎస్సై శ్రీనివాసులు, పోలీసు కానిస్టేబుళ్ల లను వనపర్తి డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేస్తామని తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో వనపర్తి సిఐ కృష్ణయ్య, పానగల్ ఎస్సై శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
