గణనాథుడికి ఘనమైన పూజలు
శంకర్ పల్లి ఆగస్టు 27(ప్రజాక్షేత్రం):వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ వార్డులో గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించరు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు ప్రజలను అందరిని సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రజలందరూ పూజించాలని, శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు.
