100మీ. వెడల్పుతో రీజినల్ రింగ్ రోడ్డు.. నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్ ఎమ్ డి ఎ
– హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.
– 8 జిల్లాలతో అలైన్మెంట్ ఖరారు.
– 33 మండలాలు, 163 గ్రామాలు.
తెలంగాణ బ్యూరో సెప్టెంబర్ 01(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (హెచ్ఎంఆర్) పరిధిలో 100 మీటర్ల వెడల్పుతో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారు చేస్తూ హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి 8 జిల్లాలు, 33 మండలాల పరిధిలోని 163 గ్రామాలకు చెందిన డిజిటల్ మ్యాప్, ఆయా గ్రామాల్లోని పలు సర్వే నెంబర్లతో కూడిన వివరాలను హెచ్ఎండీ ఏ వెబ్సైట్ పెట్టారు. త్రిపుల్ ఆర్ వెళ్లే గ్రామాలకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ పొందుపర్చారు. హెచ్ఎండీ ఏ జారీచేసిన నోటిఫికేషన్ పేర్కొన్న సర్వే నెంబర్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 15వ తేదీలోపు హెచ్ఎండీఏ కమిషనర్ పేరుతో అందజేయాలని సూచించింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. అయితే రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారుచేశారు.
– భూసేకరణకు సన్నాహాలు
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారె డ్డి, మెదక్, సిద్దిపేట్, నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో త్రిపుల్ ఆర్ అలైన్ మెంట్లో భాగంగా 163 గ్రామాలను గుర్తించారు. సదరు గ్రామాల్లోని సర్వే నెంబర్లకు సంబంధించిన భూములను సేకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారు. అభ్యంతరాల స్వీకరణతోపాటు పరిశీలించిన తర్వాతనే తుది నోటిఫికేషన్ జారీచేయనున్నారు. అనంతరం నోటిఫికేషన్ పొందుపర్చిన సర్వే నెంబర్లకు సంబంధించిన భూములను సేకరించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
– 8 జిల్లాల్లో అలైన్మెంట్
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) 8 జిల్లాల్లోంచి పోతుంది. దానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ను కూడా ఖరారు చేశారు. దీనికి సంబంధించిన డిజిటల్ మ్యాప్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) మాత్రం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మాత్రమే ఉన్నది.
– రంగారెడ్డి జిల్లా
ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, చెన్నంపల్లి, పోలేపల్లి, సింగంపల్లి. ఫరూక్ నగర్ మండలంలోని బీమారం, చించోడు. కేశంపేట మండలంలోని నిర్ధవెల్లి, తొమ్మిదిరేకుల. కొందుర్గు మండలంలోని అగి ర్యాల, చెరుకుపల్లి, కొందుర్గు(ఈస్ట్), కొం దుర్గు (వెస్ట్), తంగెలపల్లి, వనంపల్లి. మా డ్గుల మండలంలోని మాడ్గుల, అన్నబోయినపల్లి, బ్రాహ్మణపల్లి, ఇర్విన్, కలకొండ. తలకొండపల్లి మండలంలోని చంద్రదన, గర్విపల్లి, జూలపల్లి, రాంపూర్, వెంకట్రావుపేట్.
– మహబూబ్ నగర్ జిల్లా
బాలానగర్ మండలంలోని అప్పాజిపల్లి, బోడజనంపేట, చిన్నరేవల్లి, గౌతపూర్, గుండేడ్, మాచారం, పెద్దాయపల్లి, సూరారం, ఉడిత్యాల్, వనమవానిగుడ.
– మెదక్ జిల్లా
నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంట, ఖాజిపేట, మూసాపేట, జానకంపేట (ముహమ్మదాబాద్), నాగులపల్లి, పెద్దచింతకుంట, రెడ్డిపల్లి, తిరుమలపూర్, తుజాల్ పూర్. శివంపేట మండలంలోని గుండిపల్లి, కొంతన్‌పల్లి, కొత్తపేట, లింగోజిగుడ, ఫాంబండ, పోతులబొగుడ, రత్నాపూర్, ఉసిరికాపల్లి. తూప్రాన్ మండలంలోని దతర్పల్లి, గుండరెడ్డి పల్లి, కిష్టాపూర్, నాగులపల్లి, నర్సంపల్లి, వట్టూరు, వెంటాయిపల్లి.
– నల్లగొండ జిల్లా
చండూరు మండలంలోని గట్టుప్పల్, తెరట్పల్లి. చింతపల్లి మండలంలోని కుర్మేడు, కుర్మపల్లి, మల్లేపల్లి, వింజామూరు. మర్రిగుడ మండలంలోని భట్లపల్లి, దామెరభీమన్ పల్లి, మర్రిగుడ, నామపూర్, సారంపేట్, వట్టిపల్లి. మునుగోడు మండలంలోని వెలమకన్నె
– యాదాద్రి భువనగిరి జిల్లా
చౌటుప్పల్ మండలంలోని తంగెడుపల్లి, చిన్నకొండూరు, నేలపట్ల, తాళ్లసింగారం. నారాయణపూర్ మండలంలోని చిమ్మిర్యాల, గుడిమల్కాపురం, కంకణాలగుడెం, కోతులపురం, పుట్టపాక, సర్విల్. భువనగిరి మండలంలోని గౌస్ నగర్, కేసారం, పెంచకల్ పహాడ్, రాయగిరి, తుక్కాపురం, యర్రంబల్లే. తుర్కపల్లి మండలంలోని వెల్పూపల్లి. తుర్కపల్లి(ఎం) మండలంలోని దత్తాయిపల్లి, ఇబ్రహీంపట్నం, కోనాపురం, వీరారెడ్డిపల్లి. వలిగొండ మండలంలోని గోకారం, పహిల్వాన్ పూర్, పొద్దుటూరు, రెడ్లరేపాక, వెర్కట్పల్లి. యాదగిరిగుట్ట మండలంలోని దతార్పల్లి, మల్లాపూర్.
– వికారాబాద్ జిల్లా
మోమిన్‌పేట మండలంలోని దేవరంపల్లి, టేకులపల్లి. నవాబ్‌పేట్ మండలంలోని చించేల్పేట్, చిట్టిగుడ, దాతపూర్, వట్టిమినపల్లి, యావపూర్. పూడూరు మండలంలోని గంగుపల్లి, ఘట్‌పల్లి, కర్వెల్లి, మాంచన్పల్లి, మన్నెగుడ, పూడూరు, రాంచెర్ల, సిర్గాయిపల్లి, తుర్కఎంకపల్లి, ఎనుకపల్లి. వికారాబాద్ మండలంలోని బుర్హాన్‌పల్లి, పిరాంపల్లి, పులుసుమామిడి.
– సంగారెడ్డి జిల్లా
హత్నూర్ మండలంలోని దౌల్తాబాద్ (కొత్తపేట), దేవల్పల్లి, కాసల్, సికిందాపూర్. కొండాపూర్ మండలంలోని అలియాబాద్, గంగారం, గిర్మాపూర్, మాచెపల్లి, మారేపల్లి, తొగూరుపల్లి. సదాశివ్ పేట్ మండలంలోని పెద్దపూర్. సంగారెడ్డి మండలంలోని చింతల్‌పల్లి, ఇరిగేపల్లి, కలాబ్ గూర్, కులాబ్గూర్, నాగపూర్, సంగారెడ్డి, తడ్లాపల్లి
– సిద్దిపేట్ జిల్లా
గజ్వెల్ మండలంలోని బంగ్లా వెంకటపూర్, మకత్ మసాన్‌పల్లి, ముత్రాజ్పల్లి, ప్రజ్నాపూర్, సంగాపూర్. జగదేవ్పల్లి మండలంలోని అలీరాజాపేట్, ఇటిక్యాల్, పీర్లాపల్లి. మర్కూక్ మండలంలోని చేబర్తి, అంగడి కిష్టాపూర్, ఎర్రవల్లి, పాములపర్తి. రాయిపోల్ మండలంలోని బేగంపేట్, యల్కల్. వర్గల్ మండలంలోని జబ్బాపూర్, మెంటూరు (నెమ్ టూర్), మైలారం (మక్తా).
