ఎన్ని ప్రమాదాలు జరిగినా పట్టించుకోని అధికారులు
– మున్సిపల్ అధికారుల వలె జనవాడ గ్రామానికి పెను ప్రమాదాలు.
– జన్వాడ గ్రామంలో విద్యుత్ పనుల కోసం బావి పక్కన గుంత.
– మున్సిపల్ అధికారుల వల్లే ఈ ప్రమాదాలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
– పక్కనే ఉన్న ఫిరంగినాల, మహిళా భవనం వైపు బావి కులుతోందని ఆరోపణలు.
– దయచేసి మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
శంకర్ పల్లి, సెప్టెంబర్ 07(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా, నార్సింగి మున్సిపల్ పరిధిలోని జన్వాడ వార్డులో గత 15 రోజుల ముందు విద్యుత్ పోలు వేసే క్రమంలో భారీగా బావి పక్కన గుంత చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో లోతు ఎక్కవడంతో కాంక్రీట్ తో పూడిచారు. అనంతరం కొన్ని రోజుల క్రితం పక్కనే ఉన్న 10 నుండి 12 ఫీట్ల లోతుగా మారింది. సంబంధిత మున్సిపల్ అధికారులు వచ్చి తనిఖీ చేసి పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఆ బాయి పూర్తిగా కూలిపోయింది. ఆ పక్కనే ఉన్న ఫిరంగినాల మరియు మహిళా భవనం వైపు ఈ బావి కులుతూ వస్తుంది. దీంతో చుట్టుపక్కల ఉండే స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఈ బావి గ్రామం యొక్క తాగునీరు కోసం వినియోగించేవారని ఇప్పుడు కొంతమంది అధికారులు మరియు రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతో ఇలా జరగడం పట్ల స్థానికులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాలకు మున్సిపల్ అధికారులే కారణమని గ్రామస్తులు తెలుపుతున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ బావ యొక్క మరమ్మత్తులు చేసి ఆ బావికి పునర్ వైభవం తీసుకురావాలని మళ్ళీ ఆ బావి ఒక గుర్తింపు పదిలంగా ఉండేలా మళ్లీ చొరవ తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
