దళిత బాలికపై అత్యాచారం..
– డయల్ 100కు ఫోన్ చేసిన మైనర్ బాలిక
యాచారం సెప్టెంబర్ 07(ప్రజాక్షేత్రం):దళిత మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడగా మరొకరు ఆ దాడికి ఒడిగట్టడంతో బాలిక 100 నెంబర్ కు ఫోన్ చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా.. అక్కడికి వెళ్లిన మైనర్ దళిత బాలికను అదే గ్రామానికి చెందిన గడలా క్రాంతి కుమార్, (27) బాషా మోని క్రాంతి, (24) మీ తల్లికి యాక్సిడెంట్ అయ్యిందని తెలిపారు. అక్కడికి తీసుకెళ్తామంటూ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నందివనపర్తి, తాటిపర్తి, గ్రామాల మధ్యన హనుమాన్ దేవాలయం వెనకాల ఉన్న ఓ గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి బాలికపై గడలా క్రాంతి కుమార్, (27) లైంగిక దాడికి పాల్పడ్డాడు అనంతరం బాషా మోని క్రాంతి, (24) బెదిరించి అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో బాలిక తన వద్ద ఉన్న ఫోన్ తో 100 నెంబర్ కు డైల్ చేసింది. దీంతో వెంటనే పోలీసులు రావడంతో అక్కడి నుంచి ఇద్దరు పరారయ్యారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స కోసం హైదరాబాదులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
