Praja Kshetram
క్రైమ్ న్యూస్

నార్సింగి మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు..

నార్సింగి మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు..

 

– నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారి మనిహారిక

 

గండిపేట సెప్టెంబర్ 09(ప్రజాక్షేత్రం):నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక 4 లక్షల లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి ప్లాట్‌కి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్‌ను క్లియర్ చేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక 10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు మున్సిపల్ కార్యాలయంలో రెక్కీ వేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts