Praja Kshetram
తెలంగాణ

జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ల గ‌డువు మ‌రోసారి పొడిగింపు

జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ల గ‌డువు మ‌రోసారి పొడిగింపు

 

హైద‌రాబాద్ సెప్టెంబర్ 26(ప్రజాక్షేత్రం):తెలంగాణ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ కార్డుల గ‌డువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగించారు. ఈ మేర‌కు ఐ అండ్ పీఆర్ క‌మిష‌న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీతో ముగియ‌నున్న అక్రిడేష‌న్ కార్డుల కాల ప‌రిమితిని డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొత్త‌గా అక్రిడేష‌న్ కార్డుల‌ను మంజూరు చేయ‌లేదు. గ‌త 22 నెల‌లుగా అక్రిడేష‌న్ కార్డుల కాల ప‌రిమితిని ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి పొడిగిస్తూనే ఉంది. అక్రిడేష‌న్ కార్డుల గ‌డువు పొడిగించడం ఇది ఆరోసారి కావ‌డం గ‌మ‌న్హ‌రం.

Related posts