కాలనీలోనీ సమస్యలను పరిష్కరిస్తాం…
– మున్సిపల్ కమిషనర్ యోగేష్
– విద్యుత్ శాఖ ఏ ఈ ప్రదీప్ కుమార్
శంకర్ పల్లి అక్టోబర్ 16(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీ, క్రిస్టల్ టౌన్షిప్ కాలనీలోని సమస్యల గురించి మున్సిపాలిటీ కమిషనర్ యోగేష్ ని కలిసి కాలనీవాసులు వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాలనీలో మురుగునీటి పారుదల సమస్య ఉన్నందున పాత డ్రైనేజీ పైప్ లైన్ తొలగించి వాటి స్థానంలో కొత్తగా పెద్ద సైజ్ సిమెంట్ పైప్ లైన్ వేయాలని, మరియు కాలనీలో గుంతల మాయమైన పాత సిసి రోడ్ల, మట్టి రోడ్ల లో కొత్తగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని, కాలిపోయిన వీధి దీపాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని, రోడ్లకు ఇరువైపులా పెరిగిన గడ్డి పిచ్చి మొక్కలను తొలగించుటకు గడ్డి మందు పిచికారి చేయాలని, అదేవిధంగా కాలనీలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కల బెడద నివారించాలని కోరుతూ కాలనీ వాసులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కమిషనర్ సమస్యలను సవినయంగా విని సానుకూలంగా స్పందించి, తమ సిబ్బందితో కాలనీనీ సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలపడం జరిగింది. అనంతరం కాలనీవాసులందరూ స్థానిక కరెంట్ ఏ ఈ ప్రదీప్ కుమార్ ని కలిసి కాలనీలో లో-వోల్టేజ్ సమస్య రోజురోజుకీ పెరుగుతున్నందున నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఏఈ స్పందిస్తూ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పెట్టుటకు కాలి స్థలం చూపించినట్లయితే వెంటనే నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తామని, వంగి పోయిన పాత స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మంగలి విఠలయ్య, కొలాన్ ప్రతాప్ రెడ్డి, మర్పల్లి అశోక్, వర కుమార్, ప్రశాంత్ కుమార్, శ్రీశైలం గౌడ్,లీల ప్రసాద్, రామచంద్రయ్య విఠల్ రెడ్డి, నర్సింలు, తదితరులు పాల్గొనడం జరిగింది.
