Praja Kshetram
తెలంగాణ

రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట?!!

రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట?!!

 

హైదరాబాద్, అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు.బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న కవిత శనివారం నుంచి జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు కోరుకుంటే తప్ప కుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు.అయితే పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని కవిత ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. తెలంగాణ జాగృతి సామాజిక సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాల గురించి తాను పుష్కలంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడాలంటే తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒకవేళ తననుంచి పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తానన్నారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఆంధ్రలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, కేరళలో అయితే గల్లీకి ఒక పార్టీ ఉందని గుర్తుచేశారు. కాగా ఈ నెల 25న నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ కార్యక్రమం ప్రారంభంకానుంది.

Related posts