Praja Kshetram
తెలంగాణ

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాభవన్ లో వినతి

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాభవన్ లో వినతి

 

 

హైదరాబాద్, అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ మంగళవారం ప్రజా భవన్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిపై ప్రజాభవన్ ఇన్చార్జి చిన్న రెడ్డి, అధికారిని దివ్యను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినపత్రాన్ని అందజేశారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. దీనిపై వారు స్పందించి సమాచార శాఖ కమిషనర్ కు ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె రాజేంద్రప్రసాద్, బొడ్డు అశోక్, రాష్ట్ర నాయకులు కే వెంకటాచారి, మంద వేణుగోపాల్, తలశిలా యుగేందర్, కడమంచి చెన్నయ్య, కర్ణకుమార్, కొమ్ము గణేష్, తాడూరి సంపత్, జే జగదీశ్, గుండమల్ల శ్రీనివాస్, ఉదయ్, వై కుమార్, ఎం రమేష్,జి రాజేష్, ఎన్ సులక్షణ, బి వెంకటేశ్వర్లు, ఎస్ కే చాంద్ పాషా, సెగ్గెం కిరణ్, లింగన్న, కారేం ప్రశాంత్, డి అనంతయ్య, వి అశోక్, ఆర్ గణేష్, పి కృష్ణయ్య, జి మహేష్, టి సతీష్, డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts