భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలకు సిద్ధంగా ఉంది
– లోతట్టు ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు అందుబాటులో ఉండాలి
– చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భరత్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29(ప్రజాక్షేత్రం):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా తీరం దాటన కారణంగా ఉత్తర వాయువ్యం దిశగా తెలంగాణపై ప్రభావం చూపనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షం, ఈదురు గాలులు ఉన్నందున్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు, బస్సులు, రైళ్లు రద్దు చేశారని తెలిపారు. తుఫాన్ కారణంగా ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని లోతట్టు ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు అందుబాటులో ఉండాలని కోరారు. విద్యుత్, మున్సిపల్, పోలీస్ సహా ఇతర విభాగాల అధికారులతో ఆయన మాట్లాడి మొంథా గండం గట్టెక్కే వరకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆంధ్రాకు వెళ్లే వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. రైతులు సైతం విద్యుత్ శాఖ అధికారుల సూచనలు పాటించాలని భీమ్ భరత్ విజ్ఞప్తి చేశారు.
