భూకబ్జా దారుడు
– ఆదివాసీ ఎస్సీ మరియు ఎస్టీ భూములు అతని టార్గెట్
– ఆదివాసీల దగ్గర భూములు కొనడం డబ్బులు అడుగగా రౌడీలను పెట్టీ దుర్జన్యం చేయడం అతని నైజం
– పట్టించుకొని రెవెన్యూ అధికారులు, పోలీసులు, మాకు న్యాయం ఎవరు చేస్తారు అని వా పోతున్న ఆదివాసులు
– ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కానీ చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 11(ప్రజాక్షేత్రం):కొత్తగూడెం నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో గల కలెక్టరేట్ కి కుసవేటు దూరంలో గల పాలకోయతండలో ఆదివాసీల దగ్గర తక్కువ రేటు కి కొనుక్కొని వారికి డబ్బులు ఇవ్వకుండా మరల ఆ భూములను ఎస్సీ ఎస్టీ ఆదివాసీలకు అమ్ముకుంటూ భూ మాఫియా లాగా శ్రీ రామినేని హనుమంతరావు తయారు అయ్యాడు పాలకోయతండ లో గల 409 సర్వే నంబర్ లో భూమిలో నాలుగు ఎకరాల తొమ్మిది కుంటలు అతనికి లేఅవుట్ వచ్చింది, దానిలో ఇరవైనాలుగు ఫ్లాట్స్ చేసి వాటిని ఎస్సీ ఎస్టీ ఆదివాసీలలు విక్రయించి వారి ప్లాట్ లోకి వారు వెళితే రానివ్వకుండా గుండాలతో రౌడీలతో వారిపై విచక్షణ రహితంగా దాడి చేపించడం అదే భూమిని అనుకొని పడమర నా సర్వేనం 444 ఉన్న ప్రభుత్వ భూమి అర ఎకరము, దక్షిణం నా ఒక ఎకరం భూమి, ఉత్తరం నా ప్రవేట్ భూమి సుమారు ముప్పై కుంటలు కబ్జా చేశారు అటు చూస్తే ఇరువై నాలుగు ప్లాట్స్ సెటిల్ చేయకపోగా ప్రవేట్ భూమిలో గోడ మరియు ఇల్లు నిర్మించి ఇంటి చుట్టు గోడ చుట్టు రౌడీలను ఏర్పాట్ చేసి నిర్మించించిన ఇంటిలో మరక ద్రవ్యాలు మందు, గంజాయి, సేవిస్తూ రౌడీలకు ఒక అడ్డగా మార్చుకున్నారు ఇంత జరుగుతున్న కానీ రెవిన్యూ అధికారులకు ఎస్సీ ఎస్టీ ఆదివాసీలలు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన కానీ పట్టించుకొని అధికారులు పోనీ పోలీసు వారికి ఫిర్యాద్ చేసిన కానీ ఉపయోగం లేని పరిస్థితి ఇదే చనువుగా చేసుకొని రౌడీలను గుండాలను భూమికి కపాల పెట్టుకొని ఎవరైనా వచ్చి అడుగుతే వారి మీదికి దౌర్జన్యం చేపించి తీవ్రంగా గాయపరిచే విధంగా చేస్తున్నాడు, భూ కబ్జా దారుడు హనుమంతరావు పై చర్యలు తీసుకొని మా భూములు మాకు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు రెవెన్యూ అధికారులు ఇప్పటికీ కూడా స్పందించకపోతే మా భూములు పోతే పోనీ అతని ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి విక్రయిస్తున్న విషయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలుపుతున్నారు అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి.
