Praja Kshetram
తెలంగాణ

రైతాంగం సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం..

రైతాంగం సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం..

 

– కవిత తనపై దుష్ప్రచారం అర్థరహితం.

– మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

వనపర్తి, నవంబర్ 24 (ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుండగా, ఈ కాలంలో 720 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, రైతాంగం సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 10 శాతం పనులు పూర్తి చేస్తే రైతులకు జిల్లా రైతులకున్యాయం జరుగుతుందని అలాంటి కీలక విషయంలో ‘పాలమూరు బిడ్డ’ రేవంత్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.

-కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నిరంజన్ రెడ్డి

“ప్రభుత్వ వైఫల్యాలు పక్కన పెట్టి నాపై దుర్భాషలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? నేను ఒక్కసారైనా కవితను పల్లెత్తు మాట అనలేదు. కావాలనే సోషల్ మీడియాలో డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు” అని ఆరోపించారు.

-తనపై దేవుడి మాన్యం కబ్జా చేశారన్న ఆరోపణలను ఖండించిన నిరంజన్ రెడ్డి.

పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. మా ప్రభుత్వం ఇప్పుడు లేదు… నాపై నేరాలు రుజువు చేయండి” అని సవాల్ విసిరారు.తన వ్యక్తిగత జీవితం, ఆస్తులపై జరుగుతున్న ప్రచారం తప్పుడు సమాచారంతో నిండి ఉందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. “నాకు ఎక్కడా ఫామ్‌హౌజ్‌లు లేవు. నా స్వగ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి ఒక్కటే ఉంది. నీకు హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇండ్లు, గండిపేటలో ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

కెసిఆర్‌పై తన నిబద్ధతను గుర్తుచేసుకుంటూ

“పార్టీ కష్టకాలంలోనే నేను కెసిఆర్‌ను వదల్లేదు. ఆయన మాటలకు ఎప్పుడూ తుచాతప్పలేదు. మేము కెసిఆర్‌కు వన్నెతెస్తుంటే… నువ్వు మాత్రం ఆయనను మానసికంగా వేధిస్తున్నావు” అని విమర్శించారు. కవిత జైలు శిక్ష అనుభవించిన సమయంలో కెసిఆర్ అభిమానులు తీవ్రంగా బాధపడ్డారని పేర్కొంటూ, “కూతురు కావడంతో గౌరవిస్తున్నాం… ఆ గౌరవాన్ని నిలబెట్టుకో” అని వ్యాఖ్యానించారు.

Related posts