Praja Kshetram
తెలంగాణ

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో ప్రజల ముందుకు యువ అభ్యర్తి 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో ప్రజల ముందుకు యువ అభ్యర్తి

 

షాబాద్ డిసెంబర్ 12(ప్రజాక్షేత్రం):గురుకులంలో నేర్చుకున్న నియమం నిష్ఠ నిజాయితీ తన జీవితానికి మార్గదర్శకమని చెప్పుకుంటూ ఆ విలువలను గ్రామాభివృద్ధికి అంకితం చేయాలనే లక్ష్యంతో లింగాల ప్రవీణ్ కుమార్ షాబాద్ గ్రామపంచాయతీ 8వ వార్డు అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సేవ దీక్ష గురుకుల బాటలో తీర్చిదిద్దిన సామాజిక చైతన్యం తనకు ప్రేరణగా నిలిచిందని ఆయన తెలిపారు చదివిన చదువు ఉద్యోగానికి కాదు… అవసరమైన చోట ప్రజల కోసం ఉపయోగపడాలన్న సంకల్పంతో ఈ ఎన్నికల రంగంలో అడుగుపెట్టినట్టు పేర్కొన్నారు. 8వ వార్డులో ప్రజల సమస్యలను సమీపంగా తెలుసుకొని తక్షణ పరిష్కారం పై దృష్టి పెట్టె నాయకత్వం అవసరమని భావించిన ప్రవీణ్ కుమార్ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు యువతకు అవకాశాలు అవకాశాలు వృద్ధులకు ఆదరణ పంచాయతీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు రావడం స్థానిక ప్రజల్లో చర్చ నీ యాంశాంగా మారాయి. ప్రజలు నమ్మితే గురుకులంలో నేర్చుకున్న విలువలను ఎనిమిదవ వార్డు అభివృద్ధికి పూర్తిగా వినియోగిస్తానని లింగాల ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ స్టూలు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తన వార్డులో అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోతానని గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలతో మమేకమై ఉంటానని ఆయన గుర్తు చేశారు ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న నేనున్నా అని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా స్టూలు గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.

Related posts