Praja Kshetram
తెలంగాణ

భూ సర్వేలో అవకతవకలు – తప్పుడు రిపోర్టుతో రైతుకు అన్యాయం.

భూ సర్వేలో అవకతవకలు – తప్పుడు రిపోర్టుతో రైతుకు అన్యాయం.

 

శంకర్ పల్లి డిసెంబర్ 19(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలం సింగాపురం గ్రామానికి చెందిన రైతు పంతులు అనంతరెడ్డి తండ్రి లేట్ అంజిరెడ్డి, మండల రెవెన్యూ కార్యాలయ ఇన్ ఛార్జ్ సర్వేయర్ జలజపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన పట్టా భూమి సర్వే విషయంలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, తనకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే అనంతరెడ్డికి సింగాపురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 137 లో 3 ఎకరాల 18 గుంటల పట్టా భూమి ఉంది. గతంలో కంది బైపాస్ రోడ్డు అక్విషన్ లో 0-23 గుంటల భూమి పోగా, మిగిలిన భూమిని 2022లో ఎంఆర్ఓ సర్వేయర్ ద్వారా సర్వే చేయించారు. అయితే ఆ సర్వే రిపోర్టుపై అసంతృప్తితో ఆయన ఆర్‌డిఓ కు అప్పీల్ చేసుకోగా, 2024లో ఆర్‌డిఓ సర్వేయర్ వచ్చి సర్వే నిర్వహించి 2 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నట్లు నిర్ధారించి హద్దులు ఏర్పాటు చేశారు. బాధిత రైతు కథనం ప్రకారం.. 25 ఏళ్ల క్రితం ఆయన తన పట్టా భూమి నుండి 0-05 గుంటల స్థలాన్ని సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ వారికి తాత్కాలిక రోడ్ వేసుకోవడానికి ఇచ్చారు. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ 13న (13-09-2025) ఎంఆర్ఓ ఇన్ ఛార్జ్ సర్వేయర్ జలజ ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, హడావుడిగా రీ-సర్వే నిర్వహించారు. అందులో 100 ఫీట్ రోడ్ నీ 60 ఫీట్ రోడ్ గా పంచానమా చేసి తప్పుల తడక గా సర్వే చేసింది. ఈ సర్వేలో గతంలో ఆర్‌డిఓ నిర్ధారించిన 2-30 గుంటల హద్దులు కాదని, రోడ్ లో 0.23 గుంటలు పోయిన నోటీసు ఉండగా ఇపుడు 0.32 గుంటలు రోడ్ లో చూపించి అన్యాయం చేస్తుంది. ఇట్టి విషయం అడగగా నా సర్వే నాది వేరే వాళ్ల సర్వే తో నాకు పని లేదు అని సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ వారితో కుమ్మక్కై, వారికి లబ్ధి చేకూర్చేలా తన 0-09 గుంటల భూమిని కోల్పోయేలా చేశారని ఆయన పేర్కొన్నారు. అధికారులు కావాలనే తప్పుడు లెక్కలతో నా భూమిని తగ్గించి చూపిస్తున్నారు. అవినీతికి పాల్పడిన ఇన్ ఛార్జ్ సర్వేయర్ జలజపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. సమగ్ర విచారణ జరిపి నా భూమిలో అక్రమంగా కబ్జా చేసిన 0-09 గుంటల భూమిని తిరిగి నాకే దక్కేలా చూడాలి” అని అనంతరెడ్డి ఉన్నతాధికారులను కోరారు.

Related posts