టిజిఎస్ఆర్టిసిలో 198 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ డిసెంబర్ 25(ప్రజాక్షేత్రం):రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టిఎస్ఎ ల్పిర్బి)నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీని వాసరావు పోస్టుల వివరాలు గురువారం ఓ ప్రక టనలో వెల్లడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొ రేషన్లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ (టిఎస్టి), మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ (ఎంఎస్టి) పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నామన్నారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీకి 84 ఖాళీలు, మె కానికల్ సూపర్వైజర్ ట్రెయినీకి 114 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ రెండు వర్గాల పోస్టులకు నెలవారీ వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఉంటుందని వివ రించారు. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు www.tgprb.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ధరాఖా స్తు ఫారాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పోస్టులకు సంబం ధించిన పూర్తి నోటిఫికేషన్ వెబ్సైట్లో అందు బాటులో ఉంటుందని, అర్హతలు, నింబధనల ప్రకారం అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
