షాబాద్లో ఘనంగా పట్నం అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
షాబాద్ డిసెంబర్ 27(ప్రజాక్షేత్రం):షాబాద్ పట్టణంలో పట్నం అవినాష్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు వేలాది కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అవినాష్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బొకేలు అందజేసి, పుష్పమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొంపల్లి అనంత రెడ్డి, ధర్మన్నగారి వెంకట్ రెడ్డి, వీసీ మహేందర్ రెడ్డి, చల్లా శేఖర్ రెడ్డి, దారెడ్డి వెంకట్ రెడ్డి, పెద్దొళ్ళు ప్రభాకర్, షాబాద్ పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ రావు, మాజీ అధ్యక్షుడు నక్క శ్రీనివాస్ గౌడ్, జడల రాజేందర్ గౌడ్, నరసింహారెడ్డి పొన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పిటిసిలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలకు మరింత ఉత్సాహం చేకూర్చారు. షాబాద్తో పాటు చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాద్నగర్, పరిగి ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
