Praja Kshetram
తెలంగాణ

నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు శుభాకాంక్షలు తెలిపిన రుద్రారం కాంగ్రెస్ శ్రేణులు

నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు శుభాకాంక్షలు తెలిపిన రుద్రారం కాంగ్రెస్ శ్రేణులు

 

– కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలకు శుభాకాంక్షలు

షాబాద్ జనవరి 01(ప్రజాక్షేత్రం):నూతన సంవత్సరం సందర్భంగా రుద్రారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం నిర్వహించారు. రుద్రారం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఫామిన భీమ్ భరత్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలను శాలువాలతో ఘనంగా సత్కరించి, పార్టీపై ఉన్న నమ్మకం, ఐక్యతను స్పష్టంగా చాటారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండ స్వర్ణలత సతీష్ కుమార్, గ్రామ నాయకులు అల్లవాడ బాలయ్య, కావాలి రమేష్, బండి మల్లేష్, కావాలి మాణిక్యం, శేఖర్ కుమార్, రవి, వెంకటయ్య, దయాకర్, అజయ్, అంజయ్య, యాదయ్య, కృష్ణయ్య, ప్రశాంత్, మైపాల్లతో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, నూతన సంవత్సరంలో రుద్రారం గ్రామంతో పాటు షాబాద్ మండల ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ సమయంలో గ్రామాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామని, రోడ్లు, తాగునీరు, విద్య, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

Related posts