Praja Kshetram
క్రైమ్ న్యూస్

నకిలీ తుపాకీతో జ్యువెలరీ షాపులో దోపిడీ యత్నం

నకిలీ తుపాకీతో జ్యువెలరీ షాపులో దోపిడీ యత్నం

 

నాగారం జనవరి 02(ప్రజాక్షేత్రం):కీసర మండలం నాగారంలోని సత్యనారాయ కాలనీలో ఉన్న బాలాజీ జ్యువెలర్స్‌లో శుక్రవారం సాయంత్రం నకిలీ తుపాకీతో దుండగులు దోపిడీకి యత్నించారు. షాపులోకి ప్రవేశించిన దుండగులు యజమానిని నకిలీ తుపాకీ చూపిస్తూ బెదిరించి బంగారు ఆభరణాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే యజమాని అప్రమత్తమై ధైర్యంగా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో దుండగులు ఎటువంటి ఆభరణాలు దోచుకోకుండా అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన సమయంలో షాపులో ఉన్న కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ లభించిన నకిలీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షాపులో అమర్చిన సీసీ కెమెరాల్లో దుండగుల కదలికలు నమోదవడంతో వాటి ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts