Praja Kshetram
తెలంగాణ

మల్లాపూర్‌లో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేత అండ

మల్లాపూర్‌లో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేత అండ

 

కాప్రా జనవరి 04(ప్రజాక్షేత్రం):మల్లాపూర్ డివిజన్ న్యూ భవాని నగర్ కాలనీలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హరి కుటుంబానికి గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ అండగా నిలిచారు. మల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల సమాచారంతో ఆదివారం హరి నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ అక్బర్, సంయుక్త కార్యదర్శి వి.శ్రీనివాస్, కోయలకొండ రాజేష్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బాతరాజు రాహుల్, యాసీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts