Praja Kshetram
తెలంగాణ

జమ్మిగడ్డలో శేరి మణెమ్మ సేవా కార్యక్రమం

జమ్మిగడ్డలో శేరి మణెమ్మ సేవా కార్యక్రమం

 

కాప్రా, జనవరి 04(ప్రజాక్షేత్రం):డా. ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డలో బీఆర్‌ఎస్ ఉద్యమకారురాలు శేరి మణెమ్మ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పేదలు, నిరుపేదలకు దుప్పట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందిస్తాయని అన్నారు. ప్రజల సంక్షేమానికి దోహదపడే కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శేరి మణెమ్మ మాట్లాడుతూ, పేదల సేవే తమ లక్ష్యమని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై వెంకన్న, జవర్‌నగర్ ఎస్సై మౌనికతో పాటు పలువురు రాజకీయ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Related posts