Praja Kshetram
క్రైమ్ న్యూస్

ఏసీబీకి పట్టుబడ్డ సివిల్ సప్లై డిఎం. 

ఏసీబీకి పట్టుబడ్డ సివిల్ సప్లై డిఎం.

 

వనపర్తి ప్రతినిధి జనవరి 08(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా పౌరసరఫరాల అధికారి కుంభ జగన్మోహన్ గురువారం రాత్రి ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి జగన్మోహన్ తో పాటు ఆయన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్ ధాన్యం కేటాయింపు కోసం ఓ మిల్లర్ తో 1,75,000 డిమాండ్ చేయగా 50 వేలకు ఒప్పందం చేసుకొని సదరు రైస్ మిల్లర్ దగ్గర డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అప్రమత్తమై వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఆ తర్వాత వారిని నేడు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

Related posts