వలిగొండలో పులి సంచారం రాత్రి బయటకు వెళ్ళవద్దు
వలిగొండ,జనవరి 18(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గుట్ట మీద పులి సంచరిస్తున్న డ్రోన్ ఫోటో నిర్ధారణ కావడంతో వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువులు, జీవాలను ఇంటికి తెచ్చుకోవాలని వలిగొండ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి వేళలో ద్విచక్ర వాహనాలపై, సైకిళ్లపై ప్రయాణించవద్దని హెచ్చరించారు.
