భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్.
-వనపర్తి సిఐ కృష్ణయ్య.
వనపర్తి ప్రతినిధి, జనవరి18 (ప్రజాక్షేత్రం):భర్తను హత్య చేసి ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసిన భార్య శివమ్మను అరెస్టు చేసినట్లు వనపర్తి సీఐ కృష్ణయ్య తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు గోపాల్పేట ఎస్సై జగన్మోహన్ ను హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన శానాపల్లి మల్లయ్య అనే గొర్రెల కాపరి తన సతీమణి శివమ్మపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడేవాడని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న పాయల పరమేష్ ఇంటిముందు గుండ్ల గడ్డ కాలనీలో గొర్రెలు నిలిపే స్థలంలో భార్యాభర్తల మధ్య రాత్రి సమయంలో గొడవ జరిగి ఆవేశంతో ఊగిపోయి భర్తపై పారతో దాడి చేయగా తీవ్ర గాయాలయి రక్తపు మడుగులో పడి మృతి చెందినట్లు తమ విచారణలో తెలిసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శానాపల్లి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా మృతుడి భార్య హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చి ఆదివారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
