Praja Kshetram
క్రైమ్ న్యూస్

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

*బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు స్పాట్ డెడ్*

 

రంగారెడ్డి,జనవరి18(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఒక దారుణ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.గొల్లపల్లి నుంచి బహదూర్ గూడ వైపు వెళ్తున్న బైక్ అతివేగంతో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన అభిజిత్ దాస్ (25) మరియు బీహార్‌కు చెందిన సుజిత్ కుమార్ ముఖియా (20) మృతి చెందారు. వీరిద్దరూ బండారి ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్మికులుగా పని చేస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Related posts