Praja Kshetram
పాలిటిక్స్

చేవెళ్ల అసెంబ్లీ మేనేజ్మెంట్ కమిటీ గిరిజన మోర్చ్ ఇన్చార్జిగా హర్షవర్ధన్ నాయక్

చేవెళ్ల అసెంబ్లీ మేనేజ్మెంట్ కమిటీ గిరిజన మోర్చ్ ఇన్చార్జిగా హర్షవర్ధన్ నాయక్

శంకర్ పల్లి ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం):గురువారం నాడు భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ లో గల చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం లో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించిన ఇన్చార్జిగా యువ నాయకుడు వి హర్షవర్ధన్ నాయక్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ నాయక్ మాట్లాడుతూ బిజెపి పార్టీ మరియు చేవెళ్ల పార్లమెంట్ మేనేజ్మెంట్ దేశీయ నాయక్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి గిరిజన రాష్ట్ర నాయకులుపంతు గోపాల్ నాయక్, కిషన్,చందర్,బాబు,బాలు,సుభాష్,మోహన్, తదితర మండల నాయకులు పాల్గొన్నారు.

Related posts