ఎంపీ రంజిత్ రెడ్డి నామినేషన్ కి భారీగా తరలిన శంకర్ పల్లి మండల్ మరియు మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు
శంకర్ పల్లి ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం):గురువారం నాడు పార్లమెంట్ సభ్యుడు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి నామినేషన్ కి శంకర్ పల్లి మండల్ మరియు మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. శంకర్ పల్లి మండల్ మరియు మున్సిపల్ నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కి పూర్తి మద్దతు తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మరియు రంజిత్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శంకర్ పల్లి మాజీ సర్పంచ్ బిస్సోల శ్రీధర్ మాట్లాడుతూ శంకర్ పల్లి మండలం మరియు మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇస్తామని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని ఇరువురు తెలిపారు. అదేవిధంగా వీళ్లు మాట్లాడుతూ శంకర్ పల్లి మండలం మరియు మున్సిపాలిటీ నుండి ప్రతి ఒక్క ఊరు నుండి అలాగే మున్సిపల్ పరిధిలో గల ప్రతి ఒక్క వార్డు నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో శేరి అనంత్ రెడ్డి, మైహ్మద్, శ్రీశైలం యాదవ్, రామక్రిష్ణ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, వెంకటేష్, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.