కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 27 (ప్రజాక్షేత్రం) రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవి కాలాన్ని మరో ఏడాదికి పొడిగించింది.ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చితోనే వారి గడువు ముగియగా ఆయా విభాగాధిపతుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని బట్టి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పదవి కాలాన్ని పొడిగించింది.
