Praja Kshetram
తెలంగాణపాలిటిక్స్

రేవంత్ రెడ్డి – కెసిఆర్ తోడుదొంగలు

*రేవంత్ రెడ్డి – కెసిఆర్ తోడుదొంగలు*

*బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి “డీకే అరుణ”*

*పెద్ద ఎల్కిచర్లలో మీడియా ప్రతినిధులతో డీకే అరుణ చిట్ చాట్*

*పాలమూరు జాతీయ హోదాకు డీకే అరుణ పదవికి ఏదైనా సంబంధం ఉందా..?*

*ఈ ఎన్నికలు దేశం కోసం – ధర్మం కోసం*

*కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే ఓటు మురిగిపోయినట్టే*

*అడ్డగోలుగా దోచుకునే నాయకుల నా గురించి మాట్లాడేది..?*

షాద్ నగర్ ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం): తెలంగాణ పోరాటంలో పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటే నిలబడి ఎంపీగా గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు తోడ్పాటు అందించారని అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి కల్వకుర్తికి చెందిన రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజలు రాజకీయ భవితవ్యం ఇచ్చారని ఈ ఇద్దరు నాయకులు జిల్లా ప్రజల సహకారంతో రాజకీయ అభివృద్ధి చెంది నేడు జిల్లా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదని కెసిఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు తోడుదొంగలేనని అడ్డగోలుగా దోచుకునే నాయకుల నా గురించి మాట్లాడేది..? అంటూ పాలమూరు పార్లమెంటు బిజెపి అభ్యర్థిని డీకే అరుణ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగుడా మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, స్థానిక నేతలు కమ్మరి భూపాలాచారి, కందూరి మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జన సంఘ్ పరివార్ నేత మాజీ సర్పంచ్ కందూరి కృష్ణారెడ్డి స్వగృహంలో స్థానిక మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ను గెలిపిస్తే పాలమూరు ప్రాంతాన్ని, ప్రజలను కెసిఆర్ అడ్డగోలుగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇప్పించలేదని డీకే అరుణమ్మ పై అవాకులు చవాకులు కేసీఆర్, రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏదైనా సంబంధం ఉందా? అని ఆమె ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల జాతీయ హోదాకు డీకే అరుణమ్మ జాతియ ఉపాధ్యక్షురాలు పదవికి సంబంధం ఏముందని ఆమె ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి కెసిఆర్ పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆమె మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో దోచుకునేందుకు ఎన్నిసార్లు ప్రాజెక్టు డిజైన్లు మార్చారో చెప్పాలని అన్నారు. లెక్కపత్రం లేని డిపిఆర్ లను కేంద్రం ఎలా పరిగణలోకి తీసుకుంటుందని ఆమె ప్రశ్నించారు. ప్రాజెక్టు విషయంలో చేయాల్సిన పొరపాట్లను చేసి జాతీయ హోదా ఇవ్వలేదని అంటే ఎలా అని ఆమె మండిపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు రాజకీయ భవితవ్యాన్ని ఇచ్చారని నేడు ముఖ్యమంత్రిగా అయ్యాక ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు రేవంత్ రెడ్డి ఓరగబెట్టేది ఏంటో చెప్పాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానాల్లో ఇద్దరు ఒకటేనని ఇద్దరు కలిసి పాలమూరు జిల్లాను దోచుకునేందుకు వెనకాడబోరని ఆమె ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు ప్రజలకు హామీ ఇచ్చారనీ వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలు పోటీ చేస్తేనే మహిళలు అవుతారా? ఇతర పార్టీలో మహిళలు ఉంటే వారు మహిళలు కారా? అని ఆమె ప్రశ్నించారు. మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, బిజెపి పార్టీకి ఒక న్యాయమా? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు అరుణమ్మ అంటే భయమని ఆమె అన్నారు. పాలమూరు జిల్లా గణనీయమైన అభివృద్ధి కోసం డీకే అరుణమ్మ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అభివృద్ధి మారిందని ఆమె ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి చిక్కడు దొరకడు అని అతని కావలసిన వారికి మాత్రమే దొరుకుతాడని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే ఆ ఓటు మురిగిపోతుందని ఆమె అన్నారు. పాలమూరు ఆడబిడ్డగా తనకు ఓటు వేసి గెలిపిస్తే పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని డీకే అరుణ అన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కోసం కాదని దేశం కోసం జరగబోయే ఎన్నికల్లో ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలకు మరోసారి ప్రజలు మోసపోవద్దని పార్లమెంటు ఎన్నికల్లో మోడీని ప్రధాని చేయాలంటే కచ్చితంగా బిజెపికి ఓటు వేయాలని తనను ఎంపీగా గెలిపించాలని ఆమె కోరారు. పాలమూరు ఆడబిడ్డగా అన్ని ఊర్లకు వచ్చి ఓట్లు అడుగుతున్నానని బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా మీడియాతో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మరి భూపాల్ చారి, మాజీ సర్పంచ్ కందూరి కృష్ణారెడ్డి,
జిల్లెడు చౌదరి గూడెం మండల అధ్యక్షుడు బోయ కురుమయ్య, నాయకులు మనోహర్ రెడ్డి, ఆకుల ప్రదీప్, ప్యాట అశోక్, ఎదిర రాజు, అనిల్, నల్ల ప్రభు, రావీర్యాల రాజు, బాలరాజ్, నరేందర్, యాదగిరి, శివకుమార్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Related posts