అభివృద్ధిని చూసీ ఓటు వేయండి
చేవెళ్ల గడ్డపై రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా: బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
శంకర్ పల్లి మే 06 (ప్రజాక్షేత్రం): ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని చేసి బిజెపికి ఓటు వేయండి అని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలో మునిసిపల్, మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి బీడీఎల్ చౌరస్తా నుండి పురవీధుల గుండా రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా ఇంద్రారెడ్డి చౌరస్తా వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మన పార్లమెంట్ పరిధిలో స్థానిక వ్యక్తిగా నాకు ప్రతి నియోజకవర్గంలోని అన్ని మండలాలపై అవగాహన ఉన్నదనీ ఇక్కడ అవసరాలు నెరవేర్చవిధంగా అన్ని పనులు జరగాలంటే కేంద్రంలో ఏర్పడేది పక్కాగా బిజెపి ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ కూడా బిజెపి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మోడీకి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అని అన్నారు. ఆరు గ్యారెంటీ పతకాల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రపంచ పటంలో మన దేశ స్థానం సుస్థిరంగా నిలవాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన రంజిత్ రెడ్డి దాన దొంగ, గుడ్ల దొంగా అని ఆరోపణలు ఉన్నాయనీ అంతేకాకుండా సిటీ సరిహద్దుల్లో గల ఓ హనుమాన్ టెంపుల్ ని ధ్వంసం చేసి అపార్ట్మెంట్లు కట్టించి అమ్ముకున్న ఘనత రంజిత్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. స్థానిక పరిస్థితులపై అతనికి పూర్తిస్థాయిలో అవగాహన లేదు.
నేను చాలా గ్రామాలలో తిరుగుతూ చదువు రాని నిరక్షరాశులను కలిశానని, మనకు రేషన్ షాపులలో ఇచ్చేది మోడీ బియ్యం అని సాధారణ ప్రజలనుకుంటున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేవి రైతులకు ఎరువుల కోసం భారీ సబ్సిడీలతో యూరియా, గ్రోమోర్ తదితర ఎరువులతో పాటు మరెన్నో పథకాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా యువకులకు ఎన్నో రకాల స్కీములు ప్రవేశపెట్టినది కేంద్ర ప్రభుత్వం అని తెలిపారు. కుటుంబాల ఆత్మగౌరవం కొరకు, ప్రతి కుటుంబానికి టాయిలెట్లు నిర్మించిన ఘనత మోడీది. మోడీ పేద ప్రజలకు ఏం కావాలో అవి చెప్పినవి చేస్తారు. చెప్పనివి కూడా అమలు చేస్తారు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి బీదరికంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి బీదల బాధలు అతనికి తెలుసు. ఇటువంటి మంచి పనులను చూసే ఎంతోమంది నాయకులు ఆకర్షితులై మోడీ వెంట నడవడానికి ఈరోజు భారీగా చేరికలు జరుగుతున్నాయి.
బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొత్తపల్లి ఎంపీటీసీ శోభా సుధాకర్ రెడ్డి, ప్రొద్దుటూరు తాజా మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి, పట్టణ వ్యాపారస్తులు మిరియాల శ్రీనివాస్, దండు మోహన్ బిజెపిలో చేరారు. వారికి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని రెండోసారి పార్లమెంటుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, మండల, మున్సిపల్ అధ్యక్షులు రాములు గౌడ్, సురేష్ యాదవ్, మునిసిపల్ ఇన్చార్జి వాసుదేవ్ కన్నా, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ,రాజ్ కుమార్, గోవింద్ రెడ్డి, రవికుమార్, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, అనిశెట్టి సురేష్ పాల్గొన్నారు.