తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు
హైదరాబాద్ మే 06 (ప్రజాక్షేత్రం)
ఎండలకు తాళలేకపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పిం ది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది.
భానుడు భగభగమం టూ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావ డానికి జంకుతున్నారు. తీవ్రమైన వేడి, వడగాలు లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. నేడు రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తా యని పేర్కొన్నారు.
ఎల్లుండి భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యా పేట, యాద్రాది, వనపర్తి, నారాయణ పేట, జోగు లాంబలో వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.